కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ!

Congress Leader Nagam Janardhan reddy Fires on Harish Rao - Sakshi

మంత్రి హరీశ్‌ రావు జైలుకు పోవడం ఖాయం

కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి

సాక్షి, నాగర్ కర్నూలు : భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుపై కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు కట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది కాదని, ఈ విషయంలో మంత్రి హరీశ్‌ రావు అన్ని అబద్ధాలే చెప్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతిని తాను బయటకు తీస్తున్నానని, ప్రాజెక్టు కోసం నాసిరకం పంపులు, మోటార్లు వాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనీలాండరింగ్‌ కేసులో మంత్రి హరీశ్‌ రావు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top