సీఎం టూర్‌.. వెస్ట్‌లో సర్వత్రా విమర్శలు

CM chandrababu tour in west godawari, private schools declare holidays - Sakshi

చంద్రబాబు జన్మభూమి సభలకు స్కూల్‌ బస్సుల్లో ప్రజల తరలింపు

అందుకోసం సోమవారం స్కూళ్లకు సెలవు.. ఆదివారం తెరిచి ఉంచిన ప్రైవేటు బడులు

ఏలూరు, సాక్షి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం కూడా ప్రైవేటు పాఠశాలలు తెరిచి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని సోమవారం ప్రైవేటు పాఠశాలలకు యాజమన్యాలు సెలవు ప్రకటించాయి. సోమవారం పోలవరం, వేగేశ్వరపురంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు.

ఈ సందర్భంగా జన్మభూమి సభలకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్‌ బస్సులను వినియోగించాలని అధికార టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యాలు.. సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించి మరీ సీఎం సభకు తమ బస్సులను సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కార్యక్రమం కోసం ఇలా ఆదివారం పాఠశాలలు నిర్వహించడం, సోమవారం సెలవు ఇవ్వడం, పిల్లల స్కూల్‌ బస్సులను సీఎం సభల కోసం ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంపై జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top