మొగల్తూరుకు చిరు ఫ‍్యామిలీ చేసిందేమీ లేదు.. | chiranjeevi family doing nothingh for Mogalthur | Sakshi
Sakshi News home page

మొగల్తూరుకు చిరంజీవి ఫ‍్యామిలీ చేసిందేమీ లేదు..

Mar 23 2019 11:59 AM | Updated on Mar 23 2019 2:58 PM

chiranjeevi family doing nothingh for Mogalthur - Sakshi

సాక్షి, భీమవరం : మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం మొగల్తూరుకు చేసిందేమీ లేదని స్థానికుడు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి భుజంగరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ’చిరంజీవి కుటుంబం వల్ల మొగల్తూరులోని ప్రజలకు ఏం ప్రయోజనం జరగలేదు. విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇంతకీ సమాజానికి ఏం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న వ్యవహారాన్ని కానీ, ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసు ఘటనను పవన్‌ ఎందుకు ఖండించలేదు. అంటే చంద్రబాబుతో ఉన్న రహస్య స్నేహం ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్లు భావిస్తే ప్రజలు చూస్తున్నారు. ఏపీ రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయని మొన్నటి వరకూ చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు పవన్‌. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబుతో పవన్‌ కుమ్మక్కు అయ్యారని ప్రజలు భావిస్తున్నారు.’  అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement