రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌ | chinta samba murthi commented over kcr | Sakshi
Sakshi News home page

రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌

May 4 2018 2:24 AM | Updated on Aug 15 2018 9:06 PM

chinta samba murthi commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆత్మహత్యలు లేని తెలంగాణ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతులు పిట్టల్లా రాలిపోతున్నా కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.

పంటరుణాలు, వడ్డీ మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పసల్‌ బీమా యోజన కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు పథకం అంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తీరు వల్లనే రైతులు కంట తడి పెడుతున్నారని సాంబమూర్తి ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement