breaking news
chinta samba murthy
-
రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలు లేని తెలంగాణ చేస్తామన్న సీఎం కేసీఆర్ రైతుల ఉసురు పోసుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతులు పిట్టల్లా రాలిపోతున్నా కేసీఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. పంటరుణాలు, వడ్డీ మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టం జరిగిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పసల్ బీమా యోజన కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతులకు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు పథకం అంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తీరు వల్లనే రైతులు కంట తడి పెడుతున్నారని సాంబమూర్తి ఆరోపించారు. -
బీసీల అభివృద్ధికి అధిక నిధులివ్వండి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీవర్గాల అభివృద్ధికోసం కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేసినా, సరిపడా నిధులివ్వక బీసీ వర్గాలు అభివృద్ధిని సాధించలేక పోయారని, కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా బీసీ అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు సీఎం కే సీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, రాష్ట్ర చేతివృత్తుల కమిటీ ఛైర్మన్ వన్నాల శ్రీరాములు తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు. కార్పొరేషన్లకు కమిటీలను నియమించడంతోపాటు, ఒక్కో కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆయా కులాలను ఆదుకోవాలని కోరారు. చేనేత బోర్డుకు అప్పుల మాఫీ కింద రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ శాఖలకు వస్త్రాల సరఫరా, రాజీవ్ విద్యామిషన్ పనులన్నింటినీ ఆప్కోకు కేటాయించాలని కోరారు. అన్నివృత్తుల వారికి క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు.