అప్పుడు మోదీ తరహాలోనే.. ఇప్పుడు యెడ్డీ! | Chief Minister B S Yeddyurappa in Vidhan Soudha | Sakshi
Sakshi News home page

May 17 2018 10:55 AM | Updated on May 17 2018 2:20 PM

Chief Minister B S Yeddyurappa in Vidhan Soudha - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప విధానసౌధకు వచ్చారు. ఈ సందర్భంగా విధానసౌధలోకి అడుగుపెట్టే సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి.. ప్రమాణం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత 2014 మేలో పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే తరహాలో పార్లమెంటు మెట్లకు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటును దేవాలయంగా అభివర్ణిస్తూ.. పార్లమెంటు మెట్లను ఆయన మొక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా విధానసౌధను ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణిస్తూ.. సభ మెట్లను మొక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement