రాహుల్‌ ఎక్కడా ప్రచారం చేస్తే.. అక్కడ ఓటమే! | Chhattisgarh CM Raman Singh Fires on TRS, Congress | Sakshi
Sakshi News home page

Dec 1 2018 7:06 PM | Updated on Mar 18 2019 9:02 PM

Chhattisgarh CM Raman Singh Fires on TRS, Congress - Sakshi

సాక్షి, కామారెడ్డి: దేశంలో రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చవిచూస్తోందని ఛత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 18  రాష్ట్రాల్లో రాహుల్‌ ప్రచారం చేస్తే 18 రాష్ట్రాల్లో కాం​గ్రెస్‌ ఓడిపోయిందన్నారు.

గడిచిన నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ తానిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్‌ మోసం చేశారని,  రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి పథకం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement