ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఖరారు రేపే!

Chhattisgarh Assembly Election Result 2018, Decision on CM to be taken tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో సీఎం అభ్యర్థులను ఖరారుచేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఛత్తీస్‌గఢ్‌పై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ చేస్తున్న కసరత్తులు ఇంకా కొలిక్కిరాలేదు. పీసీసీ చీఫ్‌ భూపేశ్‌ బఘేల్‌, విపక్షనేత టి.ఎస్‌.సింగ్‌దేవ్‌, చరణ్‌దాస్‌ మహంత్‌, తామ్రధ్వజ్‌ సాహు సీఎం పదవికి పోటీపడుతున్నారు. కొత్తగా ఎన్నికైన 68మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఇప్పటికే తెలుసుకున్న అధిష్ఠానం తుదినిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరపుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఛత్తీస్‌గఢ్‌ పరిశీలకుడు ఖర్గే ఈ చర్చల్లో పాల్గొన్నారు. భూపేశ్ బఘేల్‌, టీఎస్‌ సింగ్‌దేవ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరనేది రాహుల్‌ ఆదివారం ప్రకటించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిని రేపు ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత PL పూనియా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో 15ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు దక్కించుకుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top