అలాగైతే బీజేపీకి కష్టమే: పార్టీ నేత నాగం

change party after ugadi, says Nagam Janardhan Reddy - Sakshi

ఉగాది తర్వాత పార్టీ మార్పుపై నిర్ణయం

మాజీ మంత్రి, బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌‌: తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై వ్యాఖ్యలుచేశారు. తెలంగాణ బీజేపీలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం బీజేపీ నేత నాగం మీడియాతో మాట్లాడారు. అనుచరులు, అభిమానుల సూచన మేరకు తాను బీజేపీని వీడుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ మిత్ర పక్షంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతిపై తాను పోరాడుతున్నా పార్టీ సహకరించడం లేదని, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌తో దోస్తీ వల్ల బీజేపీకి నష్టం కలుగుతుందన్నారు. తెలంగాణలో కాస్తో కూస్తో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం కాంగ్రెస్ పార్టేనని బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ ఉగాది తర్వాత పార్టీ మార్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తనలాంటి అనుభవజ్ఞుడికి బీజేపీలో అనేక సందర్భాల్లో అవమానాలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని, ఇవే తనకు చివరి ఎన్నికలని నాగం ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top