జూన్‌ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి

Chandrababu Strange Comments at the Press Meet - Sakshi

మీడియా సమావేశంలో చంద్రబాబు

కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ నా ప్రభుత్వం ఉంటుంది

నన్ను సమీక్షలు చేయొద్దంటే ఎలా?

ఎన్నికలకూ ప్రభుత్వానికీ సంబంధం ఏమిటి?

ఈసీ అధికారులు ఢిల్లీలో కూర్చుని ఫోజులు కొడతారా!

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు నాపై గవర్నర్‌ను కలవడమేమిటి?

సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌ 8వ తేదీ వరకు తానే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2014లో అదే తేదీన తాను ప్రమాణ స్వీకారం చేశానని, అందువల్ల ఈ ఏడాది అప్పటి వరకు తనకు సమయం ఉందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఈ ప్రభుత్వం ఉంటుందని, అమెరికాలో అయితే ఎన్నికలు పూర్తయిన ఎనిమిది వారాలు పాత ప్రభుత్వమే కొనసాగుతుందని తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను సమీక్షలు చేయవద్దంటే ఎలాగని, విధాన నిర్ణయాలు కాకుండా మిగిలిన పనులు నిర్వహించుకోవచ్చునని తెలిపారు. ఎన్నికలకూ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని, పరిపాలన కూడా తామే చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మేం వచ్చేస్తున్నాం.. గెలిచేస్తున్నామని అంటున్నారని ఎక్కడికి వస్తారని, ఎందుకు అంత ఆయాసం అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై దేశం మొత్తాన్ని తాను ఎడ్యుకేట్‌ చేస్తున్నానని, తన వల్లే దీనిపై అంతటా చర్చ జరుగుతోందని తెలిపారు. ఈవీఎంలు పనిచేయలేదని ఎన్నికల కమిషన్‌ ఒప్పుకుందని, ఇందులో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. తొమ్మిది వేల కోట్లతో వీవీ ప్యాట్‌లు పెట్టి వాటిని లెక్కించడం కుదరదంటున్నారని, ఎందుకు కుదరదని ప్రశ్నించారు. మేధావులు, విద్యార్థులు, మీడియా దీనిపై స్పందించాలన్నారు. ఈవీఎంలను వీవీప్యాట్‌లతో సరిపోల్చమంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. వాళ్ల చిన్నాన్నను చంపేసి గుండె ఆగిపోయిందని చెప్పారని, విచారణ జరుగుతుంటే ఎస్‌పీని బదిలీ చేయించారని వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. 

నేను వెళ్లిన చోటల్లా కేంద్రం దాడులు చేయిస్తోంది
దేశంలో తాను ఎక్కడికి వెళితే అక్కడ కేంద్రం దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తాను కర్నాటకలో మాండ్య వెళితే కుమారస్వామి సోదరుడు రేవణ్ణ ఇంటిపైనా, చెన్నై వెళ్లి ప్రెస్‌మీట్‌ పెడితే కనిమొళి ఇంటిపైనా ఐటీ దాడులు చేశారని చెప్పారు. కుమారస్వామి, నవీన్‌ పట్నాయక్‌ల హెలీకాఫ్టర్లను సోదాలు చేశారని, బీజేపీ ముఖ్యమంత్రుల హెలీకాఫ్టర్లను, ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో మాత్రం తనిఖీలు చేయడంలేదన్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు తనకు వ్యతిరేకంగా గవర్నర్‌ను కలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే ఎందుకు గవర్నర్‌ని కలవలేదని, ప్రధాన కార్యదర్శి పునేఠ, ముగ్గురు ఎస్పీలను బదిలీ చేస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎస్‌ను కోవర్టు అన్నానని, అందులో తప్పేమిటని ప్రశ్నించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌లు తనను తప్పుపట్టడం ఏమిటన్నారు. పోలింగ్‌ రోజు ఐదు గంటలకు సీఎస్‌ డీజీపీ దగ్గరకు ఎందుకు వెళ్లాల్సివచ్చిందన్నారు.

ఎన్నికల నిర్వహణలో ఈసీ పెద్దలు పూర్తిగా విఫలమయ్యారని, ఢిల్లీలో కూర్చుని ఫొటోలకు ఫోజులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంలను తీసుకెళ్లి రెండు, మూడు రోజులు ఇంట్లో పెట్టుకున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి రెండు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందరికీ జీతాలు చెల్లించామని, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు మాత్రం ఇంకా ఇవ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తయ్యాయని, ఈ పనులకు సంబంధించి కేంద్రం ఇంకా రూ.4,508.35 కోట్లు ఇవ్వాల్సివుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షపాతం లోటులో ఉండడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చాయని, 3,494 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. జలవాణి పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని వివరించారు.

మరిన్ని వార్తలు

19-05-2019
May 19, 2019, 22:02 IST
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచి  ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
19-05-2019
May 19, 2019, 21:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఉత్కంఠ భరింతంగా సాగిన...
19-05-2019
May 19, 2019, 21:05 IST
బెంగాల్‌లో వికసించిన కమలం
19-05-2019
May 19, 2019, 20:56 IST
తమిళనాట డీఎంకే.. కర్నాటకలో బీజేపీ హవా
19-05-2019
May 19, 2019, 19:53 IST
సీట్లు తగ్గినా యూపీలో బీజేపీకే మొగ్గు
19-05-2019
May 19, 2019, 19:42 IST
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఏపీలో అత్యధిక శాతం ప్రజలు కోరుకుంటున్నారు.
19-05-2019
May 19, 2019, 19:19 IST
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదుముదురు ఘటనలు మినహా రీపోలింగ్‌ నిర్వహణ సక్రమంగానే జరిగింది....
19-05-2019
May 19, 2019, 18:41 IST
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
19-05-2019
May 19, 2019, 18:30 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్‌...
19-05-2019
19-05-2019
May 19, 2019, 18:16 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన...
19-05-2019
May 19, 2019, 17:03 IST
సీఎం కావాలన్నదే ఆయన కల..
19-05-2019
May 19, 2019, 16:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల...
19-05-2019
May 19, 2019, 16:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా...
19-05-2019
May 19, 2019, 16:45 IST
పట్నా: భోపాల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్‌పై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని...
19-05-2019
May 19, 2019, 15:58 IST
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ అమితాసక్తి నెలకొంది.
19-05-2019
May 19, 2019, 15:30 IST
పట్నా : పుట్టుకతోనే తల భాగం అతుక్కొని పుట్టిన బిహారీ కవలలు సబా- ఫరా (23)లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ...
19-05-2019
May 19, 2019, 14:32 IST
తమను ఓటు వేయకుండా బీజేపీ అడ్డుకుందని ఉత్తరప్రదేశ్ చాందౌలీ లోక్‌సభ నియోజకవర్గంలోని తారాజీవన్‌పూర్‌ గ్రామస్తులు ఆరోపించారు.
19-05-2019
May 19, 2019, 14:22 IST
మహిళా ఓటర్లకు రాహుల్‌ హ్యాట్సాఫ్‌
19-05-2019
May 19, 2019, 14:09 IST
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top