
సాక్షి, అమరావతి: హత్యాయత్నం కేసులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు సహకరించడంలేదని కోర్టుకు చెప్పాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో జగన్‌పై హత్యాయత్నం కేసు, ఆ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.
సిట్‌కు వైఎస్ జగన్ వాంగ్మూలం నిరాకరించిన నేపథ్యంలో ఏపీ పోలీసులకు ప్రతిపక్ష నేత సహకరించడంలేదని చెప్పాలని అవసరమైతే దీనిపై కోర్టులో పిటిషన్ వేయాలని చంద్రబాబు వారికి సూచించారు. వైఎస్సార్ సీపీ ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతుండటంతో దానిపైనా చర్చించి సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం. మరోవైపు తాజా పరిణామాలపై చర్చించేందుకు మంత్రులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాలని భావించినా.. చివరి నిమిషంలో దాన్ని రద్దు చేశారు.