అవినీతి పాలనకు చరమగీతం | Sakshi
Sakshi News home page

అవినీతి పాలనకు చరమగీతం

Published Fri, Nov 9 2018 12:49 PM

Buggana Rajender Slams Chandrababu Naidu - Sakshi

కర్నూలు, బేతంచెర్ల:  టీడీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  అన్నారు.   మండల పరిధిలోని గూటుపల్లె గ్రామంలో వైఎస్సార్‌సీపీ  మండల కన్వీనర్‌ సీహెచ్‌ లక్ష్మీరెడ్డి, గ్రామ నాయకులు వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యుడు బాలుడు, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, భరణి  ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ  సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు జన్మభూమి  కమిటీల పేరుతో వారి కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేశారని విమర్శించారు. పింఛన్‌ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రుణం పొందాలన్నా టీడీపీ ప్రభుత్వంలో ప్రతి పనికో రేటు కట్టి దోచుకు తిన్నారని ఆరోపించారు. 

అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయి వచ్చే ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీపై గెలవలేమని సీఎం చంద్ర బాబు నాయుడు.. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకున్నారన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి  వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక   హత్యాయత్నానికి పాల్పడి, టీడీపీ నాయకులు కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా.. నవరత్నాల పథకాలను అమలు చేస్తామన్నారు.  అర్హులైన పేదలందరికీ ఇళ్లు, వృద్ధులకు నెలకు రూ. 2వేల పింఛన్‌ ఇస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టి..ఆత్మాభిమానంతో తలెత్తుకొని జీవించాలన్నారు. గ్రామంలో బోయపేట, చిన్నప్పగారి వీధిల్లో తాగునీటి కుళాయిలు వేయించాలని, సాముహిక  మరుగుదొడ్లు, సీసీ రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరారు. వెంటనే పంచాయతీరాజ్, ఆర్‌డబ్లు్యఎస్‌  అధికారులతో బుగ్గన ఫోన్లో మాట్లాడారు.

మహిళల కోసం వెట్‌ లెట్రిన్‌లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బుగ్గన  నాగభూషణం రెడ్డి , బాబుల్‌రెడ్డి,  ఖాజ హుసేన్, రాజేంద్రనాథ్‌రెడ్డి, మునేశ్వర్‌రెడ్డి,  చలం రెడ్డి,  రామచంద్రుడు, తిమ్మయ్య,  మల్దిరెడ్డి, నాగేశ్వరరావు, ఈశ్వర్‌రెడ్డి,  ఇలియాజ్, కిరణ్, భాస్కర్, మురళీ,  నడ్డి శ్రీను,  గుమ్మగాల రాజు, రహిమానుపురం మధు, ఎర్రమల, రామాంజనేయులు,  శ్రీను,   మిద్దె సుధాకర్,   తిరుమలేశ్వర్‌రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement