సీరియల్‌ మాదిరిగా టీడీపీ నుంచి చేరికలు | BJP Leader slams Chandrababu Naidu over polavaram project | Sakshi
Sakshi News home page

టచ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

Aug 2 2019 2:43 PM | Updated on Aug 2 2019 2:45 PM

BJP Leader slams Chandrababu Naidu over polavaram project - Sakshi

సాక్షి, విజయవాడ:  టీడీపీ నుంచి బీజేపీలో చేరికలు సీరియల్‌ మాదిరిగా జరుగుతున్నాయని  బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ నాయుడు  వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆగస్ట్‌ సంక్షోభంపై టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరతారంటూ ఆ పార్టీ ఫీలర్లు వదలడంతో ఎప్పుడు...ఏ నేత కాషాయ కండువా కప్పుకుంటారో అనేది హాట్‌ టాఫిక్‌గా మారింది. 

రమేష్‌ నాయుడు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు.  చంద్రబాబు తన అవినీతి కోసం పోలవరం ప్రాజెక్ట్‌ కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌ సందర్శన పేరుతో టీడీపీ నేతలు కోట్లు రూపాయల ప్రజా ధనాన్ని మింగేశారని విమర్శించారు.  పోలవరంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రమేష్‌ నాయుడు స్వాగతించారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ముఖ్యమంత్రి పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement