టీఆర్‌ఎస్‌ నీటి బుడగ లాంటిది : లక్ష్మణ్‌ | BJP Leader K Laxman Comments On TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నీటి బుడగ లాంటిది : లక్ష్మణ్‌

Aug 14 2019 8:56 PM | Updated on Aug 14 2019 9:27 PM

BJP Leader K Laxman Comments On TRS - Sakshi

సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ లాంటిదని, ఎప్పుడు పేలిపోయేది తెలియదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ విమర్శించారు. ఏక వ్యక్తి పాలన సాగిస్తున్న టీఆర్ఎస్‌లో అంతర్గత అసంతృప్తులు ఉన్నాయన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో అధికారం దిశగా బీజేపీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నాం. జమ్మూకశ్మీర్ పరిణామం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొంది. సర్పంచులు ఎన్నికై మూడు నెలలు గడుస్తున్నా వారికి నిధులు ఇవ్వడం లేదు. కేంద్రం 14 ఫైనాన్స్ ద్వారా ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. 

రాష్ట్రంలో 3 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రకటించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకె ఉంది. అందుకే బీజేపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నెల 18న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వేలాది మంది బీజేపీలో చేరబోతున్నార’’ని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement