
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అవినీతిని భయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు ప్రేమేందర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ముగిసిన తర్వాత ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించి, అవినీతి టీఆర్‌ఎస్‌ను ఎండగట్టడానికే నిర్ణయించుకున్నామన్నారు. ఈ మున్నిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపుతామని, పార్లమెంట్ నియోజకవర్గాలను క్లస్టర్‌గా విభజించి ఎన్నికల్లో పనిచేస్తాం అన్నారు.