మున్సిపల్‌ ఎన్నికలపై సమావేశమైన బీజేపీ

BJP Core Committee Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో కొంత పట్టు సాధించిన బీజేపీ, త్వరలో జరగనున్న మున్సిపాల్‌ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఈ దిశగా ఆదివారం హైదరాబాద్‌లో కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో  పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సూచించిన అంశాలపై చర్చ కొనసాగింది. దీనితోపాటు బీజేపీ సభ్యత్వ నమోదు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలను  చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రాజా సింగ్‌, డీకే అరుణ హాజరైయ్యారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top