‘రిగ్గింగ్‌ కోసమే భారీ బలగాలు’ | Big Forces For Rigging | Sakshi
Sakshi News home page

‘రిగ్గింగ్‌ కోసమే భారీ బలగాలు’

Nov 12 2018 3:21 AM | Updated on Nov 12 2018 3:22 AM

Big Forces For Rigging - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం 18 నియోజకవర్గాల్లో జరగనున్న మొదటి దఫా ఎన్నికల్లో పోలీస్‌ సిబ్బంది ద్వారా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఆరోపించాయి. భారీ ఎత్తున పోలీస్‌ బలగాలను, హెలికాప్టర్లను ఏర్పాటుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఈ రెండు కమిటీల కార్యదర్శులు వికల్ప్, జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలీసులతో జర్నలిస్టులు, ఎన్నికల సిబ్బంది కలిసి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను బహిష్కరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, బలవంతంగా ఓట్లు వేయించడం, రిగ్గింగ్‌కు పాల్పడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వాలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement