విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు?  | Bandi Sanjay Kumar Slams Telangana Government | Sakshi
Sakshi News home page

విద్వేషాలు రెచ్చగొడుతోంది ఎవరు? 

May 19 2020 3:41 AM | Updated on May 19 2020 3:41 AM

Bandi Sanjay Kumar Slams Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎవరని, భైంసాలో అల్లర్లకు కారణం ఏమిటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. మొన్నటివరకు కఠినంగా ఆంక్షలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు. భైంసాలో ఒక మత ప్రార్థనకు ఎందుకు అనుమతి ఇచ్చారని నిలదీశారు. ఒక వర్గం వారిపై అత్యాచారం కేసులు, విద్వేషాలు రెచ్చగొ ట్టారన్న కేసులు పెట్టారని, అదే మరో వర్గం వారిపై చిన్న కేసులను పెట్టి వదిలేశారని దుయ్యబట్టారు. అక్కడి ఎస్‌పీ, సీఐలపై చర్యలు చేపట్టాలని, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొందరు పోలీసుల వైఖరి చూసి ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement