తెలంగాణలో టీఆర్‌ఎస్‌.. ఆంధ్రాలో జగన్‌ కింగ్‌ | Balka Suman Election Campaign In Manthani | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీఆర్‌ఎస్‌.. ఆంధ్రాలో జగన్‌ కింగ్‌

Mar 25 2019 1:13 PM | Updated on Mar 25 2019 1:13 PM

Balka Suman Election Campaign In Manthani - Sakshi

మాట్లాడుతున్న బాల్క సుమన్‌

సాక్షి, మంథని: దేశంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి బాగా లేదని, తెలంగాణలో టీఆర్‌ఎస్‌.. ఆంధ్రాలో జగన్‌ కింగ్‌ అని చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. మంథనిలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉందని, కాలం కలిసి వస్తే ఢిల్లీ గద్దెపై కేసీఆర్‌ను ప్రధానిగా చూస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు. మాజీ ఎంపీ వివేక్‌ పార్టీకి ద్రోహం చేశారని, ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. పెద్దపల్లి పాçర్లమెంట్‌ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్‌ నేత మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితున్నయ్యానన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement