'సుధాకర్‌ విషయంలో టీడీపీది మొసలి కన్నీరు'

Avanthi Srinivas Comments About Completing One Year Government In Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం : దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక దాదాపు 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని తెలిపారు. అమ్మఒడి ద్వారా ఏపీ అక్షరాస్యతలో కేరళను అధిగమించిందన్నారు. అమ్మఒడి ద్వారా అక్షరాస్యతతో పాటు అభివృద్ధి కూడా సాధ్యమన్నారు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు మరువలేనివన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ వాలంటీర్లకు సమచిత స్థానం కల్పించబోతున్నామని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పని చేస్తుంది.
(డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం: మంత్రి సవాల్‌)

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధికి చంద్రబాబు కొన్ని వ్యవస్థలను తన ఆధీనంలో ఉంచుకుని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. విద్యుత్‌ ఛార్జీలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. ప్రమాదకర పరిశ్రమల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని, నిబంధనలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకే భూములు వేలం వేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని.. కావాలనే ఇప్పుడు దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో టీడీపీ మొసలి కన్నీరు కారుస్తుందని, అతని సస్పెన్షన్‌ శాఖాపరమైన నిర్ణయం అని అవంతి వెల్లడించారు.
(ఏపీలో 2627కు చేరిన కరోనా కేసులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top