నటుడు శివాజీ చంద్రబాబు బినామీ?

AP State Bjp Vice President Kapileswaraiah Fires On Actor Shivaji - Sakshi

సాక్షి, కర్నూలు : సినీ నటుడు శివాజీపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపీలేశ్వరయ్య మండిపడ్డారు. ఆపరేషన్‌ గరుడ ఒక బూటకమని అన్నారు. చంద్రబాబుకు కేంద్రం నోటిసులు ఇస్తుందంటూ.. నటుడు శివాజీ కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడపై పూర్తి విచారణ జరపాలని బీజేపీ కోరిందని, కానీ పోలీసులు స్పందించలేదని తెలిపారు. చంద్రబాబును వెనకేసుకుంటూ నటుడు శివాజీ చేస్తున్న కామెంట్లు, చంద్రబాబుకు అతను బినామీ అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే శివాజీ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాగా, 'ఆపరేషన్ గరుడ' పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందంటూ సంచలనం సృష్టించి సినీ నటుడు శివాజీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్‌గా మారారు. తనకు ప్రాణహానీ ఉందంటూ చెప్పుకొచ్చారు. శివాజీ ఈ ఆరోపణలపై బీజేపీ రాష్ట​ ఉపాధ్యక్షుడు కపీలేశ్వరయ్య మండిపడ్డారు.

మరోవైపు పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళన చేయడం స్వాగతించాల్సిన అంశమన్నారు. అయితే రాష్ట్రాలు విధిస్తున్న రూ.10 మేర పన్ను భారాన్ని ఉపసంహరించుకోవాలని గతంలోనే కేంద్రం కోరిందని తెలిపారు. ఏపీలో అధిక పెట్రోల్‌ ధరలకు టీడీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రజలపై టీడీపీ ప్రభుత్వం పన్ను భారం మోపిందని అన్నారు. తక్షణమే పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని కోరారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top