‘అందుకోసమే చంద్రబాబు డ్రామాలు’ | AP Deputy CM Narayana Swamy Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ రైతుల పక్షపాతి : నారాయణ స్వామి

Jan 11 2020 3:15 PM | Updated on Jan 11 2020 4:14 PM

AP Deputy CM Narayana Swamy Comments On Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు న్యాయం చేస్తారని, ఆయన రైతుల పక్షపాతి అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటమే సీఎం జగన్‌ లక్ష్యమని పేర్కొన్నారు. శనివారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘ ముఖ్యమంత్రి జగన్‌ 7 నెలల్లోనే 90 శాతం హామీలను నెరవేర్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తాత్కాలిక భవనాలు కట్టడం తప్ప ఏమీ చేయలేదు. తన ఆస్తులను కాపాడుకోవటం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. పేదలు, విద్య, వైద్యం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. పేదపిల్లల చదువుకోసం వైఎస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఉండేలా మెను మార్పు చేశాం. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నా’మని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement