‘పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు’

Anam Ramanarayana Reddy Slams Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని కుట్రతో కేసులు పెట్టి అరెస్ట్‌ చేయటం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్‌పీకి సంబంధం లేకుండా ఇంటలిజెన్స్ డీఎస్పీ చెప్పినట్లు కింద స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.

వైఎ​​​​​స్సార్‌ సీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల్లా కాకుండా అధికారుల మాదిరిగా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. పోలీసుల అనాలోచిత నిర్ణయాలు..తప్పుడు అరెస్టులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించే ఉద్యోగులు ఇబ్బంది పడతారని హెచ్చిరంచారు.

చంద్రబాబు ఓటమి భయంతో..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటమి భయంతో వైఎస్సార్‌ సీపీ ఓట్లను తొలగిస్తున్నారని, దీనిని ప్రశ్నించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల కనుసన్నలలోనే సర్వే బృందం ఓట్లను తొలగిస్తోందన్నారు. తప్పుడు కేసులకు భయపడమని తేల్చి చెప్పారు. శ్రీధర్ రెడ్డికి అందరూ అండగా నిలిచి పోరాడతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top