గిరిజనుల సమస్యలపై అఖిలపక్షం: తమ్మినేని | All-party community issues | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యలపై అఖిలపక్షం: తమ్మినేని

Dec 27 2017 1:33 AM | Updated on Dec 27 2017 1:33 AM

All-party community issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లంబాడీలు, ఆది వాసీల మధ్య ఘర్షణ లను పరిష్కరించ డానికి ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై వామపక్ష పార్టీల సమావేశం సీపీఎం కార్యాలయంలో మంగళవారం జరిగింది.

బంజారాలు, ఆదివాసీల మధ్య ఘర్షణ పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తమ్మినేని ఆరోపించారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణ మాదిగ అరెస్టు అక్రమమని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement