పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్‌ పాలన | Alimineti Uma Madhava Reddy fire to kcr | Sakshi
Sakshi News home page

పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్‌ పాలన

Oct 10 2017 4:08 AM | Updated on Sep 5 2018 9:47 PM

Alimineti Uma Madhava Reddy fire to kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలన పిచ్చోని చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు ఎ.ఉమామాధవరెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు రెండేళ్ల కిందట సీఎం అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. మాధవరెడ్డి అంటే అభిమానం అంటూనే ఇబ్బందులు పెట్టే కుట్రలకు సీఎం దిగుతున్నారని దుయ్యబట్టారు.

పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని, ఎవరి పొత్తు లేకున్నా టీడీపీ బలం ఏమిటో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. 1983లో స్వయంగా ఎన్టీఆర్‌ టికెట్‌ ఇస్తే కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement