‘ఉద్యమ ఆకాంక్షలను వమ్ముచేసిన కేసీఆర్‌’

Ajith Singh Slams KCR Governance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోరా టాలకు ఎన్నోసార్లు అం డగా ఉన్నానని, రాష్ట్రం వస్తే ఎంతో సంతోషపడ్డానని కేంద్ర మాజీమం త్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అజిత్‌సింగ్‌ను టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం.కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్‌ నేతలు కె.దిలీప్‌కుమార్, విద్యాధర్‌రెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అజిత్‌సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు బలిదానాలు చేశారని, సబ్బండ వర్గాలు ఉద్యమించాయన్నారు.

తెలంగాణలో జరిగిన ఎన్నో సభల్లోనూ, పోరాటాల్లోనూ పాల్గొన్నట్టుగా గుర్తుచేశారు. తెలంగాణ బిల్లును ఆమోదించాలని కేంద్రమంత్రిగా ఒత్తిడి చేశానని, పార్లమెంటులోనూ మద్దతును ఇచ్చానని చెప్పారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో సుదీర్ఘకాలంపాటు పోరాడి సాధించుకున్నారని, రాష్ట్రం ఏర్పాటైతే ఎంతో సంతోషపడ్డానని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చారని విమర్శించారు. ప్రజల ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటుకావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో మహాకూటమిని అధికారంలో తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్రంలో పర్యటిస్తానని, సభల్లో పాల్గొంటానని ఆయన వెల్లడించారు.  
 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top