ఎల్‌పీయూలో సైన్స్‌ కాంగ్రెస్‌ | 106th Indian Science Congress to be inaugurated by Narendra Modi on 3 January 2019 | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూలో సైన్స్‌ కాంగ్రెస్‌

Jun 15 2018 4:42 AM | Updated on Aug 15 2018 6:34 PM

106th Indian Science Congress to be inaugurated by Narendra Modi on 3 January 2019 - Sakshi

జలంధర్‌: వచ్చే ఏడాది జరిగే 106వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) ఆతిథ్యమివ్వనుంది. 2019, జనవరి 3–7 మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్‌ గ్రహీతలు సహా సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘ఫ్యూచర్‌ ఇండియా: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైద్యం, పర్యావరణం, రసాయన శాస్త్రం తదితరాలపై సుమారు 18 ప్లీనరీ సెషన్‌లు జరుగుతాయి. జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చే గౌరవం దక్కడంపై ఎల్‌పీయూ చాన్స్‌లర్‌ అశోక్‌ మిట్టల్‌ హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement