రేపు ప్రమాణం చేయబోయే మంత్రులు వీరే..!

10 Telangana Minister to take Oath Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది.  మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వం చేపడుతున్న తొలి కేబినెట్‌ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్‌ వీడిపోయింది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌.. తదితర నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

సామాజికవర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి  సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీ నుంచి ముగ్గురు, ఎస్సీ నుంచి ఒకరు, వెలమ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ తొలిసారిగా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top