గవర్నెన్స్... వయా ఆర్డినెన్స్ | Sakshi
Sakshi News home page

గవర్నెన్స్... వయా ఆర్డినెన్స్

Published Mon, Jan 5 2015 1:45 AM

... Via e-Governance Ordinance

ప్రజాస్వామిక దేశంలో పాలనకి రాజమార్గం చట్ట సభల ద్వారానే ఉంటుంది. ఆర్డినెన్స్ మార్గం అన్నది అత్యవసరానికి ఉద్దేశించినది. చట్టసభలు నిర్వహించే అవకాశం లేనప్పుడు చేబట్టిన విషయం దేశానికి అత్యవసరమైనప్పుడు తాత్కాలిక ఉపశమన ఏర్పాటుగా ప్రభు త్వానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఆ స్ఫూర్తితోనే ప్రభు త్వం ఆర్డినెన్స్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అది అరుదైన వ్యవహారంగానే తప్ప అలవాటైన వ్యవహా రంగా ఉండరాదు.

ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా జీవనంపై తీవ్రప్రభావం చూడగల ము ఖ్య నిర్ణయాల్ని ఆర్డినెన్స్ మార్గంలో తీసుకురావడం దురదృష్టకరం. ఈ మధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసి, మళ్లీ రెండు నెలల వ్యవధిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ఈ రకమైన చర్య ప్రజాస్వామిక సంప్రదాయాల్ని అగౌరవపరచడమే.

పైగా బొగ్గు గనుల కేటాయింపులు అంశం మినహా భూసేకరణ చట్టం గానీ బీమా సవరణల చట్టం గానీ ప్రజాజీవనంపై తీవ్ర ప్రభావం చూపేవి. చట్ట సభల ద్వారా విస్తృత చర్చ జరగా ల్సినవి. ఈ తరహా చర్యల్ని ప్రభుత్వం మానుకొని, రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టసభల గౌరవాన్ని నిలపడం ద్వారానే ప్రజానీకానికి మేలు చేయడం సాధ్యం.
 - డా॥డి.వి.జిశంకరరావు  మాజీ ఎంపీ, పార్వతీపురం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement