రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన అనేక ముఖ్య సమస్యల్లో ఉద్యోగుల విభజన సమస్య ఒకటి.
సురేష్ కాలేరు
రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన అనేక ముఖ్య సమస్యల్లో ఉద్యోగుల విభజన సమస్య ఒకటి. అసలు రాష్ట్ర విభజనకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలలో జరి గిన అన్యాయాలే అన్నది నిర్వివాదాంశం.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో నీళ్లు, నిధు ల పంపిణీలకూ ఇతర పంచాయతీలకూ నిర్ది ష్టమైన నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి కాబట్టి అతి త్వర లోనే అన్నీ సర్దుకోవచ్చు. కానీ నియామకాల్లో జరిగిన అన్యాయాల్లో, ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం మాత్రం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది సత్వరమే పరిష్కరించాల్సిన సమస్య.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీని, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి సంస్థల ఉద్యోగుల పంపిణీకి.. వాటి ఆస్తులు, అప్పుల పంపకాలకు షిలాబిడే కమిటీని నియమించారు. జూన్ 2వ తేదీ ‘అప్పాయింటెడ్ డే’ నుంచి ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ చేస్తూ వర్క్ టూ ఆర్డర్ సర్వే పేరిట 58:42 శాతం నిష్పత్తిలో ‘డీఓపీటీ’. ఉద్యోగుల జాబితాను కమిటీ ప్రకటించింది. దీంతో గందరగోళం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యోగులు ఆంధ్రలోనూ, సమైక్యాం ధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యోగులు తెలంగాణలోనూ పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగుల పంపిణీలో స్థానికతను ఆధా రంగా తీసుకోవాలని, ఉద్యోగుల పంపిణీ వేగవంతం చేయాలన్న డిమాండ్‌లు వినిపించాయి. ఈ విషయంలో ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. కమలనాథన్ కమిటీ సమావేశమైన ప్రతిసారీ కొత్త నిబం ధనలు, ప్రకటనలు చేస్తూ సమస్యను జఠిలం చేస్తోంది.
అత్యంత సులువుగా జరగాల్సిన అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పంపిణీ విషయంలో ‘ప్రతూష్ సిన్హా కమిటీ’ అనేకసార్లు సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనకు ఆదేశాలు జారీచేసినా, ఇంకా తుదిరూపానికి రాలేదు. దాదాపు వేయిలోపు మాత్రమే ఉన్న అఖిల సర్వీసుల అధికారుల పంపిణీలోనే ఇన్ని సమీక్షలు అభ్యంతరాలు, పిటి షన్లు ఉంటే లక్షలాది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, అధికారుల, కార్మి కుల పంపిణీలో ఇంకా ఎన్నిసార్లు తర్జనభర్జన జరగాలో అనే అనుమా నాలు వస్తున్నాయి. 58:42 ప్రకారం స్థానికత ఆధారంగా పంపిణీ జరిగితే ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉద్యోగుల విభ జన సాధ్యమవుతుందా? అన్నది కూడా ప్రశ్నార్థకమే.
ఉద్యోగుల పంపి ణీ పద్ధతి ప్రకారం, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతిశాఖలో పై నుంచి కిందిస్థాయి వరకు క్యాడర్‌లలో నిష్పత్తి ప్రకారం విభజన జర గాలి. ఆంధ్రకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణకు కేటాయించిన ఆంధ్ర ఉద్యోగులు ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారు. తమ ఉద్యోగాన్ని ఇష్టపడి నిర్వహించని ఉద్యో గులు ఇరు రాష్ట్రాలకు ఇబ్బందే! ఉద్యోగుల పంపిణీ విషయంలో కమ లనాథన్ కమిటీ, షిలాబిడే కమిటీ పనులను వేగవంతం చేయాలి. కేం ద్ర కమిటీలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, అన్నిస్థాయి అధికారులు, ఉద్యోగులు సహకరించాలి. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే ఆప్షన్లు ఇవ్వాలి తప్ప చదువులు, సర్టిఫికెట్ల పేరిట ప్రాంతం కాని ప్రాంతంలో ఆప్షన్లు ఇవ్వడం సరికాదు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలందరూ సమస్య సత్వర పరిష్కారానికి మార్గం చూపాలి.
(వ్యాసకర్త, రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం) మొబైల్: 9866174474