రిక్రియేషన్ క్లబ్‌ల మీద నిషేధాజ్ఞలా?

రిక్రియేషన్ క్లబ్‌ల మీద నిషేధాజ్ఞలా?


ఆదిలాబాద్, కరీంనగర్, ని జామాబాద్‌లలోని పలు రిక్రి యేషన్ క్లబ్‌లలో రమ్మీ చీట్ల పేకాటను నిషేధిస్తూ పోలీసు లు తీసుకున్న చర్యల ఫలితం గా ఆ అంశం  మరోసారి వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిషేధం విధించినట్టు పోలీసులు చెబుతున్నారు. నిజానికి ఈ నిషేధం సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమైనది. ఇంకా చెప్పాలం టే, రమ్మీ ‘నైపుణ్యం’తో కూడుకున్న ఆట కాబట్టి, జూద నిషేధచట్టం దీనికి వర్తించదని న్యాయస్థానా లు స్పష్టంచేశాయి. కాబట్టి రిక్రియేషన్ క్లబ్‌లలో రమ్మీని నిషేధించడం న్యాయసమ్మతం కాదు.

 

 ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న క్లబ్‌ల గతం కొంత తెలుసుకోవాలి. ఈ క్లబ్‌లు స్వచ్ఛంద సంస్థలుగా రిజిస్టరవుతాయి. ఇందులో ఎక్కువ ఆఫీ సర్స్ క్లబ్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్, నిర్మల్ ఆఫీ సర్స్ క్లబ్ వంటి పేర్లతో 70 ఏళ్ల క్రితమే ఏర్పాటై నాయి. వీటికి కలెక్టర్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ఎస్పీ ఉపాధ్యక్షునిగా పనిచేస్తారు. నిర్మల్ వంటి ఇతర పట్టణాలలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ ఆ పదవులను నిర్వహిస్తూ ఉం టారు. ఇప్పుడు నిర్మల్ ఆఫీసర్స్ క్లబ్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్‌లలో రమ్మీపై నిషేధం విధించారు. నిర్మల్ క్లబ్‌లో రమ్మీని నిషేధిస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన ఆజ్ఞలను ఆయన ఒక దినపత్రిక ద్వారా వెల్లడించారు. దీనిని సవాలు చేస్తూ క్లబ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దానితో ఆ క్లబ్‌లో రమ్మీ ఆటకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఆదేశించింది.

 

 నిజామాబాద్ క్లబ్ మీద కూడా ఇదే రీతిలో సెప్టెంబర్‌లో నిషేధం విధించారు. ముఖ్యమంత్రి నిజామాబాద్ పర్యటన దరిమిలా ఈ పరిణామం చోటు చేసుకుంది. 2007లో కూడా ఇక్కడ రమ్మీ ఆట మీద నిషేధం విధించినపుడు హైకోర్టుకు వెళ్లి, ఆటను కొనసాగించడానికి అనుమతి తెచ్చుకున్నట్టు క్లబ్ నిర్వాహకులు చెబుతు న్నారు. ఈ నేపథ్యంలో క్లబ్ మీద పోలీ సులు ఎలాంటి నిషేధం విధించకూడదు. దీన్ని జూదంగా పరిగణించి నిషేధిస్తే, క్లబ్‌ను జూదగృహంగా భావించినట్టేనని, ఇది 1967లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదే శాలకు విరుద్ధమని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్రఖ్యాతమైన  ‘ది స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ కె.సత్యనారాయణ, ఇత రుల కేసు’లో  సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశికాలను గమనించాలి. 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కీలకమైన తీర్పులో ఇలా ప్రకటించింది.

 

 ‘రమ్మీ ఆట మూడు ముక్కలాట వలె చాన్సుల మీద ఆధారపడినది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ ఆటకు కొంత నైపుణ్యం అవసరం. ఇది ప్రధానంగా, అసమానమైన నైపుణ్యం అవసరమయ్యే ఆట. రమ్మీలో చాన్సు ఎలాంటిదంటే, బ్రిడ్జ్ ఆటలో ఉండే చాన్సు వంటిదే.’ కాబట్టి జూద నిషేధ చట్టం రమ్మీ ఆటకు వర్తించదు. ఈ చట్టం పరిధిలోకి రమ్మీ ఆట చేరనపుడు నిషేధం ఎలా విధిస్తారు? ఇంతకు ముం దు కొన్ని కేసులలో సుప్రీంకోర్టు, హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యల ఫలితంగా పదవులకు రాజీనా మా చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎన్. సం జీవరెడ్డి, ఎన్.జనార్దనరెడ్డిల విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

 

కాబట్టి ఇప్పుడు ఈ అంశా లను ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాలి. సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తెలిసి ఉన్న ఏ ము ఖ్యమంత్రి అయినా కావాలని దానికి వ్యతిరేకంగా వ్యవహరించడు. క్లబ్‌ల మీద నిషేధం అమలు చేయ మని ఆదిలాబాద్ ఎస్పీ దినపత్రిక ద్వారా తన సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం సమంజసమా? ఎలాంటి  ముందస్తు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేయకుండా క్లబ్‌ల మీద నిషేధం విధించమని నోటి మాటతో ఆదేశాలు ఇవ్వడం ఏం న్యాయం? కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఈ నిషేధం ఎత్తివేయడానికి తక్షణం చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చు.

 (వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్)

 ఎం. నారాయణరెడ్డి

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top