చిన్న దేశం.. పెద్ద సంక్షోభం | Huge crisis more impacted in Maldives | Sakshi
Sakshi News home page

చిన్న దేశం.. పెద్ద సంక్షోభం

Mar 15 2015 12:36 AM | Updated on Sep 2 2017 10:51 PM

చిన్న దేశం.. పెద్ద సంక్షోభం

చిన్న దేశం.. పెద్ద సంక్షోభం

మతోన్మాదం, ప్రజాస్వామ్యం పట్ల బద్ధవైరం కలగలసి ఇప్పుడు మాల్దీవులను కల్లోలానికి గురి చేస్తున్నాయి.

మతోన్మాదం, ప్రజాస్వామ్యం పట్ల బద్ధవైరం కలగలసి ఇప్పుడు మాల్దీవులను కల్లోలానికి గురి చేస్తున్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అరెస్ట్ (ఫిబ్రవరి 22, 2015), 13 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు (మార్చి 13, 2015), వీటిని నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతున్నాయి. మూడు ద శాబ్దాల పాటు నియంతృత్వంతో పాలించిన అబ్దుల్ గయూం మీద పోరాడి, తొలిసారి (2008) ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ నషీద్. మాల్దీవియన్ డెమాక్రటిక్ పార్టీ తరఫున ఆయన ఆ పదవికి ఎంపికయ్యాడు.

ఆ క్రమంలో ఆయన ఎన్నోసార్లు అరె స్టయ్యి, జైలు పాలైనాడు. ఆయన మీద నమోదైన అభియోగం- ఉగ్రవాదానికి ప్రోత్సాహం. అందుకే 1990 నాటి ఉగ్రవాద చట్టం ప్రకారమే మల్దీవుల న్యాయస్థానం ఈ మాజీ అధ్యక్షుడిని విచారించింది. 2012లో అబ్దుల్లా మహ్మద్ అనే ఒక న్యాయమూర్తిని నషీద్  అరెస్టు చేయించిన మాట నిజమే. అయితే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను బట్టి నషీద్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దానినే  కిడ్నాప్ అభియోగంగా మోపి ఈ శిక్ష విధించారు. ఇతర ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు కూడా న్యాయస్థానం ఆరోపణలు చేసింది.
 
 ఇరవై దీవులతో, నాలుగు లక్షలలోపు జనాభాతో పర్యాటకుల స్వర్గధా మంగా వెలుగొందుతున్న మాల్దీవుల అంతరంగ చిత్రం నిజానికి వికృతమైనది. అబ్దుల్ గయూం నియంతృత్వానికి చరమగీతం పాడి, అధికారంలోకి వచ్చిన నషీద్ ఫిబ్రవరి, 2012లో ఆ దేశ టీవీ చానెళ్ల ఎదుట కనిపించి, తాను స్వచ్ఛం దంగా రాజీనామా చేస్తున్నట్టు నాటకీ యంగా ప్రకటించారు. అయితే వెంటనే తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. తరువాత అన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాయి. పోలీసు యంత్రాంగం సాయం తో, సైన్యం నషీద్‌ను పదవీచ్యుతుడిని చేసింది. తరువాత 2013లో జరిగిన ఎన్నికలలో నషీద్ పైచేయి సాధించినట్టు వెల్లడైన ప్రతిసారి ఆ దేశ ఉన్నత న్యాయస్థానం దానిని నిరాకరిస్తూ వచ్చింది.
 
 చివరికి స్వల్ప ఆధిక్యంతో గెలిచిన అబ్దుల్ యామీన్ పాలకుడయ్యారు. ఈయన అబ్దుల్ గయూం సన్నిహిత బంధువే. ఆ ఇద్దరి తల్లులు వేరు, తండ్రి ఒక్కరే. ఒక్కొక్క అంశం వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో నషీద్ 2013 ఫిబ్రవరి నుంచి రాజధాని మాలె లోని భారత రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. న్యాయమూ ర్తి కిడ్నాప్ కేసుతోపాటు, ఆయన ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించాడని ప్రభు త్వం ఆరోపించింది. అతడు ఇస్లాంకు వ్యతిరేకి అని, నిజానికి రహస్య క్రైస్త వుడని కూడా ముద్రవేశారు. ప్రస్తుత పరిణామాల మీద భారత్‌తోపాటు, అమె రికా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ నషీద్‌ను సాధారణ నేరగాడిని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లడం ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దీనితో మాల్దీవుల ప్రజానీకమే కాకుండా, చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి.
 
 మాల్దీవుల విపక్ష శిబిరంలో నషీద్ ఇప్పటికీ ప్రముఖుడు. ఎక్కువ దీవులలో ఆయన పట్లే ఆదరణ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న యామీన్‌ను అభిశంసించే యోచన ఉన్నట్టు తాజాగా వదంతులు గుప్పుమనడంతో ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. ఇదంతా 2018లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో నషీద్‌ను పోటీ లేకుండా చేయడానికేనని ఒక మాట ఉంది. గతంలో నషీద్‌ను బంధించి ఉంచిన ధూనిధూ ద్వీపానికే తీసుకువెళ్లారు. కేసును వాదిస్తుండగానే ఆయన న్యాయవాదిని కూడా బయటకు గెంటేశారు.
 
 అయితే ఆయన దేశం నుంచి పారిపోకుండా జాగ్రత్త పడే క్రమంలోనే అరెస్టు చేయడం జరిగిందని దేశాధ్యక్షుడు ప్రకటన ఇవ్వడం విశేషం. నషీద్ పట్ల యామీన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకతను పెంచుకున్నదంటే, ఆయన హయాంలో మాలే విమానాశ్రయానికి సంబంధించి, జీఎంఆర్ సంస్థకు వచ్చిన పనులను మొన్న సెప్టెంబర్‌లో రద్దుచేసింది. ఈ అంశం మీద జీఎంఆర్‌కూ, యామీన్ ప్రభుత్వానికీ మధ్య సింగపూర్ కోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తున్నది. మాలే విమానాశ్రయం అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను నషీద్ సర్కారు ఇచ్చింది.  మాల్దీవులు చిన్న దేశమే కావచ్చు. కానీ అక్కడ జరిగిన పరిణామం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ మద్దతు ఇచ్చే క్రమంలో జరిగింది. అందుకే నషీద్ ఉదంతం ఇంత సంచలనం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement