సింగపూర్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

Ysrcp Singapore NRI Wing celebrates Ys Jagan victory - Sakshi

సింగపూర్‌ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్నిసాధించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ ఎన్నారై  విభాగం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాసిర్రీస్ పార్క్‌లో సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై వింగ్ కన్వీనర్లు దక్కత జయప్రకాష్ రెడ్డి, పృథ్వి రాజ్ ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు సింగపూర్‌లో నివసించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కుటుంబ సభ్యులు అందరూ ఈ విజయోత్సవ సంబరాల్లో పాల్గొని 'జై జగన్.. జోహార్ వైఎస్సార్' నినాదాలతో హోరెత్తించారు. స్వీట్లు పంచుకొని, విజయోత్సవ కేకు కోసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. 

సోనియా గాంధీ, చంద్రబాబు కుమ్మక్కయ్యి వైఎస్సార్ కుటుంబాన్ని ఎన్నో కష్టాలకు గురిచేసినా వైఎస్‌ జగన్ ఎదురొడ్డి ఒక యోధుడిలా పోరాడారని, ఆయనలో ఆ పోరాటతత్వం, ప్రజల పట్ల ప్రేమ, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, మాట ఇస్తే మడమ తిప్పని లక్షణమే ప్రజలకు మరింత దగ్గర చేసిందని కమిటీ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. తమ నాయకుడి పది ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఇచ్చారని, ప్రజలు జగన్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని, నవరత్నాలతో పేదల జీవితాలు బాగుపడతాయని, వైఎస్సార్ పాలనను మైమరిపించేలా జగన్ పాలన ఉండబోతుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

వైఎస్‌ జగన్‌కి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సింగపూర్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు దక్కత జయప్రకాష్ రెడ్డి, పృథ్వి రాజ్, కోర్ కమిటీ సభ్యులు బి.వి.వి శ్రీనివాసులు, పిల్లి సంతోష్ రెడ్డి, బి.ఎస్ రాజు, భూంరాజ్, సూర్య, శ్రీకాంత్, కాకర్ల మహేష్, దేవేంద్ర, సంతోష్, అర్జున్ రెడ్డి, నరసింహ, నరసింగ్ గౌడ్, సుందర్, జైపాల్, జీవన్, వేణుగోపాల్, మారక మహేష్, అజిత్, పిట్ల కస్తూరయ్య, కుమార్, సంకే శ్రీనివాస్, శామ్యూల్, రాజేందర్, కృష్ణ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top