సౌదీ రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసి మృతి

Telangana man dies in Saudi Arabia - Sakshi

దోహా : కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లిన ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ జహంగీర్‌(40) పదేళ్లుగా గల్ఫ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న భారత దేశ కాలమాన ప్రకారం ఉదయం 8 గంటల సమయంలో జహంగీర్‌ స్కూటీపై బయటకు వెళ్లాడు. స్కూటీపై వెళ్తున్న అతడిని వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య సాబేరాబేగం, ఐదుగురు పిల్లలు ఉన్నారు. జహంగీర్‌ మృతితో అతడి కుటుంబం రోడ్డున పడింది.

మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి భారీ ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. తండ్రి మృతదేహాన్ని కడసారి చూసే భాగ్యం దక్కుతుందో? లేదో? అని మృతుడి పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top