వైఎస్‌ జగన్‌కు సెయింట్‌ లూయిస్‌ ప్రవాసాంధ్రుల సంఘీభావం

Saint Louis NRIs supports Ys Jagan Padayatra - Sakshi

సెయింట్‌ లూయిస్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెయింట్‌ లూయిస్‌లోని ఎన్‌ఆర్‌ఐలు సంఘీభావం ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆంధ్ర రాష్ట్రమంతటా ప్రజలు నీరాజనాలు పడుతుండగా.. విదేశాల్లోనూ జననేత పాదయాత్రకు ప్రవాసాంధ్రులు అండగా నిలుస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సెయింట్‌ లూయిస్‌లోని క్రీవ్‌ సరస్సు సమీపంలో కిలోమీటర్‌ నడిచి  పార్క్‌లో కేక్‌ కట్‌ చేసి.. జననేత వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ ప్రాంతమంతా 'కావాలి జగన్‌ రావాలని జగన్‌' స్లోగన్‌లతో మారుమోగిపోయింది. భారతదేశం నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐల తల్లిదండ్రులు ప్రసంగించి.. అక్కడున్నవారిలో ఉత్తేజాన్ని నింపారు. 

సుబ్బారెడ్డి పమ్మి(యూఎస్‌ఏ సెంట్రల్‌ కమిటీ), నవీన్‌ గుడవల్లి(సెయింట్‌లూయిస్‌ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు), గోపాల్‌ రెడ్డి తాడిపత్రి(సెంట్రల్‌ కమిటీ), ఆర్‌కే దగ్గుమతి, రంగా చక్కా, సుధాకర్‌ రెడ్డిలతో మరికొందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top