అబుదాబిలో సత్తా చాటిన తెలుగువాడు

Raja Srinivasa Rao Won Indian Social and Cultural Center election in Abu Dhabi - Sakshi

35 ఏళ్ల లో అరుదైన గౌరవం

సదరన్ రీజియన్ సెక్రటరీగా రాజా శ్రీనివాసరావు

అబుదాబిలో తెలుగువారు తమ సత్తా చాటుకున్నారు. అక్కడ జరిగిన ఇండియన్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన రాజా శ్రీనివాసరావు విజయం సాధించారు. గతంలో ఎన్నడూ తెలుగువారికి ప్రాధాన్యత లేదు. అయితే ఈ విజయంతో తెలుగు వాడికి గత మూడున్నర దశాబ్దాలుగా లేని ప్రాధాన్యత ఈ సారి దక్కడంతో తెలుగు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజా శ్రీనివాసరావు సెంటర్‌ సదరన్‌ రీజియన్‌ సెక్రటరీగా ఎన్నిక కావడంపట్ల.. పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన రాజా శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమంలో కూడా యూఏఈలో ఉంటూ తన వంతు సహకారం అందించారు. సదరన్ రీజియన్ సెక్రటరీగా విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన గెలుపు యూఏఈలోని ప్రతి తెలుగు వారికి అంకితమన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top