పారిశుధ్య కార్మికులకు నాట్స్ సాయం | NATS helps sanitation workers in Yadadri | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికులకు నాట్స్ సాయం

Jun 20 2020 12:15 PM | Updated on Jun 20 2020 12:22 PM

NATS helps sanitation workers in Yadadri - Sakshi

యాదాద్రి: కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అండగా నిలుస్తోంది. నాట్స్ సంస్థ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా భువనగిరిలో నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి సహకారంతో 250 కుటుంబాలకు పైగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు యం.బాలరాజు, కె.మల్లేశం, మల్లేశ్వరస్వామి, జంగయ్య లక్ష్మి, పార్వతమ్మ, సరస్వతి, హుసేన్ పాషా తదితరులు పాల్గొన్నారు. 

ఈ కరోనా సమయంలోనూ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రతిరోజు విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చేయూత నివ్వడం అభినందనీయమని నూతి బాపయ్య చౌదరి అన్నారు. కార్మికులకు కష్టకాలంలో నిత్యావసర సరకులు పంపిణీ చేసిన నాట్స్ సంస్థకు, ఆ సంస్థ ఉపాధ్యక్షులు నూతి బాపయ్యకు స్థానిక నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నాట్స్ తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement