సరికొత్త లుక్‌లో యూట్యూబ్‌ | YouTube changes its logo for the first time | Sakshi
Sakshi News home page

సరికొత్త లుక్‌లో యూట్యూబ్‌

Aug 30 2017 2:41 PM | Updated on Sep 17 2017 6:09 PM

సరికొత్త లుక్‌లో యూట్యూబ్‌

సరికొత్త లుక్‌లో యూట్యూబ్‌

గూగుల్‌ నేతృత్వంలోని యూట్యూబ్‌ కొత్త హంగులతో ముందుకొచ్చింది.

శాన్‌ఫ్రాన్సిస్కోః గూగుల్‌ నేతృత్వంలోని యూట్యూబ్‌ కొత్త హంగులతో ముందుకొచ్చింది. సరికొత్త లోగోతో పాటు తన డెస్క్‌టాప్‌, మొబైల్‌ యాప్స్‌ డిజైన్‌లో భారీ మార్పులు చేపట్టింది. గతంలో చిన్నపాటి మార్పులు చేసినా ఇటీవల యూట్యూబ్‌ లోగోలో అతిపెద్ద మార్పు ఇదే కావడం గమనార్హం. ఈ మార్పులతో యూట్యూబ్‌ లోగో వివిధ డివైజ్‌లు..చిన్నపాటి స్ర్కీన్‌లపై కూడా మెరుగ్గా ఉంటుందని గూగుల్‌ పేర్కొంది. 
 
డెస్క్‌టాప్‌ పనితీరు, వ్యూయర్లకు సరికొత్త ఫీల్‌ను ఇచ్చేలా పలు మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ ఏడాది ఆరంభంలో యూట్యూబ్‌ తన డెస్క్‌టాప్‌ వెబ్‌సైట్‌లో క్లీనర్‌ ఇంటర్‌ఫేస్‌తో పాటు రాత్రివేళల్లో వీడియోలు చేసేందుకు డార్క్‌మోడ్‌ వంటి నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement