అందరినీ నిరాశపరిచావు చంద్రబాబూ..! | You disappointed us Babu:Digvijay Singh | Sakshi
Sakshi News home page

అందరినీ నిరాశపరిచావు చంద్రబాబూ..!

Oct 25 2015 8:51 AM | Updated on Mar 29 2019 9:31 PM

అందరినీ నిరాశపరిచావు చంద్రబాబూ..! - Sakshi

అందరినీ నిరాశపరిచావు చంద్రబాబూ..!

అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక హోదాపై పెదవి విప్పని చంద్రబాబునాయుడిని విమర్శించిన దిగ్విజయ్ సింగ్.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తప్పుబట్టారు. చంద్రబాబు ప్రజలందరినీ నిరాశపరిచారని పేర్కొన్నారు. శనివారం ఆయన ట్వీటర్‌లో పలు విమర్శలు సంధించారు.
 

‘‘పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్లను విస్మరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. దాని కోసం పోరాటం చేస్తుంది. చంద్రబాబు కనీసం రాజధాని శంకుస్థాపన వేడుకలో ప్రత్యేక హోదాపై డిమాండైనా చేయలేదు. యూ డిసప్పాయింటెడ్ అజ్ బాబూ..!’’ అంటూ దిగ్విజయ్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement