యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌ | Yasin Malik arrested in Srinagar | Sakshi
Sakshi News home page

యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌

Sep 29 2017 4:17 PM | Updated on Sep 29 2017 4:17 PM

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ మొహమ్మద్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని అబిగుజార్‌ ప్రాంతానికి చేరుకున్న పోలీసు బృందం మాలిక్‌ను, మరో జేకేఎల్‌ఎఫ్‌ లీడర్ బషీర్‌ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు జేకేఎల్‌ఎఫ్‌ వర్గాలు తెలిపాయి. వీరిద్దరినీ శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అక్టోబర్‌ 1న మొహర్రం సందర్భంగా కాశ్మీర్‌ వ్యాలీలో ఉరేగింపు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా వీరిని అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement