ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని బీహార్లో నిర్మించనున్నారు. పశ్చిమ చాంపరన్ జిల్లాలోని కేసారియా సమీపంలోని జానకి నగర్లో విరాట్ రామాయణ మందిరం నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని బీహార్లో నిర్మించనున్నారు. పశ్చిమ చాంపరన్ జిల్లాలోని కేసారియా సమీపంలోని జానకి నగర్లో విరాట్ రామాయణ మందిరం నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించారు. 405 అడుగుల ఎత్తు గల గోపురం, ఒకేసారి 20 వేల మంది కూర్చుకునేందుకు వీలుగా ప్రార్థనా మందిరం నిర్మించనున్నారు. దుర్గా పూజ అనంతరం ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.
పాట్నాకు ఆలయ నిర్మాణ ప్రాంతం 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. కంబోడియాలో 12వ శతాబ్ధంలో కట్టిన ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్కోర్ వట్ ఆలయం కంటే దాదాపు రెండింతలు పెద్దదిగా ఉంటుంది. కంబోడియా ఆలయం 215 ఎత్తు ఉంది. '190 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మిస్తాం. ప్రార్థనా మందిరంలో రాముడు, శివుడు, లవకుశల విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. నిర్మాణానికి 500 కోట్ల రూపాయలకుపైగా వ్యయం కావచ్చు' అని పాట్నాకు చెందిన మహవీర్ ట్రస్ట్ కార్యదర్శి కిషోర్ కునాల్ చెప్పారు.