ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక బాలికకు నిప్పంటించగా.. బెంగాల్లో అదే కారణంతో మరొక బాలికను...
మరో ఘటనలో తల్లి, కుమార్తెపై దాడి
సహరాన్‌పూర్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక బాలికకు నిప్పంటించగా.. బెంగాల్లో అదే కారణంతో మరొక బాలికను, ఆమె తల్లిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. యూపీలోని సహరాన్‌పూర్‌లో ఇద్దరు అన్నదమ్ములు తనను వేధిస్తున్నారంటూ 16 ఏళ్ల బాలిక వారిని నిలదీసింది. దీంతో వారిద్దరూ తల్లితో కలిసి ఆ బాలికకు నిప్పటించారు. బాలిక శరీరం 95 శాతం కాలిపోయి మృత్యువుతో పోరాడుతోంది. మాల్దా జిల్లా మానికచక్ గ్రామంలో తల్లీకూతుళ్లు నూర్ అలీ అనే యువకుడి ఇంటికి వెళ్లి వేధింపులపై ప్రశ్నించారు. అలీ కుటుంబసభ్యులు బాలికను, ఆమె తల్లిని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపరిచారు.