అత్యాచారం చేసి..నిప్పు పెట్టాడు! | Woman set on fire during rape attempt, dies | Sakshi
Sakshi News home page

అత్యాచారం చేసి..నిప్పు పెట్టాడు!

Jul 3 2015 3:08 PM | Updated on Apr 3 2019 8:07 PM

అత్యాచారం చేసి..నిప్పు పెట్టాడు! - Sakshi

అత్యాచారం చేసి..నిప్పు పెట్టాడు!

అత్యాచారాల రాజధానిగా పేరు గాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది.

కాన్పూర్: అత్యాచారాల రాజధానిగా పేరు గాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ(35) పై భర్త స్నేహితుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెను తగులబెట్టిన ఘటన కాన్పూర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జూన్ 25 వ తేదీన  పిప్రీ గ్రామంలో ఉంటున్న మహిళపై భర్తకు అత్యంత సన్నిహితంగా ఉండే  దినేష్ అనే వ్యక్తి విచక్షణారహితంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.


అయితే ఆమె బ్రతికితే తన గురించి బయటకు చెప్పేస్తుందని భావించి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో  తీవ్ర గాయాలు పాలైన ఆమె గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.  ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె వాంగ్మూలం, భర్త ఫిర్యాదు ఆధారంగా  దినేష్ ను ఈ ఘటన జరిగిన రెండు రోజులకే  అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement