కోతుల నుంచి ప్రాణాలు కాపాడుకోబోయి.. | Woman dies while trying to escape monkey attack | Sakshi
Sakshi News home page

కోతుల నుంచి ప్రాణాలు కాపాడుకోబోయి..

Feb 14 2016 2:45 PM | Updated on Oct 1 2018 6:22 PM

కోతుల నుంచి ప్రాణాలు కాపాడుకోబోయి.. - Sakshi

కోతుల నుంచి ప్రాణాలు కాపాడుకోబోయి..

కోతి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తన సొంత ఇంటి పై నుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు విడిచింది.

ముజఫర్ నగర్: కోతి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తన ఇంటి పై నుంచి అదుపుతప్పి కిందపడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కురాల్సి అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లీలావతి(55) అనే మహిళ తన ఇంట్లోని బట్టలన్నింటిని ఉతికేసి రెండో ఫ్లోర్ పైన ఆరబెట్టింది. సాయంత్రంపూట వాటిని తెచ్చుకుందామని ఇంటిపైకి వెళ్లింది.

అక్కడ ఉన్న కోతులను గమనించని ఆమె దుస్తులను మడతపెడుతూ అదే సమయంలో అక్కడ ఉన్న మూడు కోతులను చూసి ఒక్కసారిగా వణికిపోయింది. ఈలోగా అవి దాడికి దిగాయి. దీంతో, వాటిని తప్పించుకునే క్రమంలో డాబాపై పరుగులు పెడుతుండగా అనుకోకుండా జారి రెండో ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాలు విడిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement