పబ్ కు వెళ్లిన కానిస్టేబుల్ కు వేధింపులు | Woman constable molested at a Mumbai pub near Juhu gymkhana | Sakshi
Sakshi News home page

పబ్ కు వెళ్లిన కానిస్టేబుల్ కు వేధింపులు

Jun 13 2016 11:15 AM | Updated on Mar 19 2019 5:52 PM

పబ్ లో గొడవ జరుగుతోందని తెలిసి వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ను వేధింపులకు గురిచేశారు.

ముంబై: నగరంలోని ఓ పబ్ లోని గొడవ జరుగుతుందని తెలిసిన పోలీసులు అక్కడి చేరుకుని గొడవ పడుతున్న ఇద్దరు గెస్ట్ లు, పబ్ స్టాఫ్ ను పక్కకు పంపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ను గెస్ట్ లు వేధించిన ఘటన ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జుహు జింఖానా ప్రాంతంలోని విలే పార్లే పబ్ లో చోటుచేసుకుంది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు ఒకరిని తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ సుందర్ వర్దన్(28), మరొకరు కేరళకు చెందిన ఎస్ శాస్త్రి కృష్ణ(25)లుగా గుర్తించారు.

నిందితులు ఇద్దరు పబ్ లో 14వేల రూపాయల బిల్లును చెల్లించమని, రేట్లు ఎక్కువ చేసి మద్యం అమ్ముతున్నారని పబ్ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పబ్ నిర్వహకులు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇద్దరు పోలీసులు, ఒక మహిళాపోలీసుల వారిద్దరిని స్టేషన్ రమ్మని కోరగా.. అందుకు వాళ్లు నిరాకరించారు. పోలీసులతో గొడవకు దిగడమే కాకుండా.. మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను ఆదివారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని, ఒక రోజు పాటు రిమాండ్ విధించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement