సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం | Woman commits 'Sati' in Bihar | Sakshi
Sakshi News home page

సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం

Dec 14 2014 4:23 PM | Updated on Sep 2 2017 6:10 PM

సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం

సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం

సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం ఘటన జరగడం విస్తుగొలిపే అంశం.

పాట్నా: సాంకేతిక యుగంలోనూ సతీసహగమనం ఘటన జరగడం విస్తుగొలిపే అంశం. బీహార్లో 70 ఏళ్ల మహిళ తన భర్త చితి మంటలపై పడి ప్రాణాలర్పించింది. సహర్సా జిల్లా పర్మానియా గ్రామంలో గాహ్వా దేవి అనే వివాహిత ఈ దారుణానికి ఒడిగట్టింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

గహ్వా దేవి భర్త శనివారం మరణించాడు. బంధువులు ఆయనకు అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్లిపోయిన తర్వాత గాహ్వా దేవి తన భర్త చితిపై పడింది. గాహ్వా దేవి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె లేని విషయాన్ని గమనించారు. వారు వెంటనే అమెను వెతుక్కుంటూ అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు వచ్చారు. గాహ్వా దేవి చితిమంటల్లో కాలిపోతున్న దృశ్యాన్ని చూశారు. మంటల్లో కాలిపోతున్న గాహ్వాదేవిని ఆమె కుటుంబ సభ్యులు రక్షించే ప్రయత్నం చేయలేదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఆమె కుమారుడు రమేష్ మండల్ ఈ విషయాన్ని తోసిపుచ్చాడు.  తన తండ్రి చనిపోయిన కొద్దిసేపటికే తల్లి మరణించిందని, ఇద్దరికీ కలసి అంత్యక్రియలు చేశామని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement