పెద్దావిడను కొట్టి.. ఇస్లామిక్ స్టేట్ అని రాశారు | Woman attacked, cloth with ISIS written on it left behind | Sakshi
Sakshi News home page

పెద్దావిడను కొట్టి.. ఇస్లామిక్ స్టేట్ అని రాశారు

Apr 10 2016 3:51 PM | Updated on Sep 3 2017 9:38 PM

పెద్దావిడను కొట్టి.. ఇస్లామిక్ స్టేట్ అని రాశారు

పెద్దావిడను కొట్టి.. ఇస్లామిక్ స్టేట్ అని రాశారు

రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో నిద్రపోతున్న ఓ 60 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఇస్లామిక్ స్టేట్ అని రాసి వెళ్లారు.

జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. తన ఇంట్లో నిద్రపోతున్న ఓ 60 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఇస్లామిక్ స్టేట్ అని రాసి వెళ్లారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అక్కడ ఇస్లామిక్ స్టేట్ అనే పేరు రాసి ఓ గుడ్డ ఆ ఇంట్లో పడేసి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నతీదేవీ అనే బీమ్ అనే ప్రాంతంలోని తన నివాసంలో చంటి మనవడితో కలిసి నిద్రపోయింది.

ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశారు. బాగా కొట్టి పడేసి వెళ్లిపోయారు. తన భర్త చూసేసరికి ఆమె గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికొచ్చిన పోలీసులు క్లూస్ కోసం పరిశీలించగా ఐఎస్ఐఎస్ అని రాసి ఉంచిన ఓ క్లాత్ ముక్క దొరికింది. అయితే, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే వారు ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement