యువకుడిపై అత్యాచారం.. యువతి అరెస్ట్‌ | Woman Abducts Minor Boy, Arrested For 'Rape' | Sakshi
Sakshi News home page

యువకుడిపై అత్యాచారం.. యువతి అరెస్ట్‌

Nov 18 2017 3:41 PM | Updated on Jul 28 2018 8:53 PM

Woman Abducts Minor Boy, Arrested For 'Rape' - Sakshi - Sakshi

సాక్షి, బెంగళూరు : బెంగళూరులో 17 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేయడంతో పాటు అత్యాచారం చేశారన్న అభియోగంపై 24 ఏళ్ల యువతిని పోలీసులు అదువులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన యువతికి  భర్తతో పాటు ఇద్దరు పిల్లలున్నట్లు తెలుస్తోంది. బాధిత యువకుడు, యువతి ఇద్దరూ బెంగళూరులోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

అత్యాచారానికి పాల్పడిన యువతిపై ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌ (లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక చర్య జరిగిందనే విషయంపై యువతీ, యువకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి భర్త డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయిర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement