ఫేక్‌ న్యూస్‌ కట్టడికి వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

WhatsApp rolls out new feature in bid to curb spread of rumours - Sakshi

న్యూఢిల్లీ: నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తెచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్‌ను స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని కేవలం ఫార్వర్డ్‌ చేశారా అని తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌ యాప్‌ తాజా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు సంస్థ మంగళవారం తెలిపింది. వినియోగదారులు ఒక మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసే ముందు అది ఎంతవరకు నిజమో సరిచూసుకోవాలని కోరింది. నకిలీ సమాచారం వ్యాప్తి కాకుండా ఉండేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వాట్సాప్‌ భారత్‌లో ప్రారంభించింది. వాట్సాప్‌లో తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందడం వల్ల దేశంలో పలుచోట్ల మూకుమ్మడి దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top