'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం' | we will decide next CM to maharastra, says Jankar | Sakshi
Sakshi News home page

'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం'

Apr 20 2016 5:51 PM | Updated on Sep 3 2017 10:21 PM

'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం'

'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం'

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది తమ పార్టీ డిసైడ్ చేస్తుందని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆరెస్పీ) చీఫ్ మహదేవ్ జనకర్ వ్యాఖ్యానించారు.

షిరిడి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది తమ పార్టీ డిసైడ్ చేస్తుందని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆరెస్పీ) చీఫ్ మహదేవ్ జనకర్ వ్యాఖ్యానించారు. షిరిడిలోని ప్రఖ్యాత సాయి ఆలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఆరెస్పీ కచ్చితంగా 25కు పైగా సీట్లును కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.సీఎంగా దేవెంద్ర ఫడ్నవీస్ ఉంటారా, లేక ఉద్దవ్ ఠాక్రే ఆ స్థానంలోకి వస్తారా అన్నది తమ పార్టీ ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.

సీఎం సీటుని తామ పార్టీ నిర్ణయించబోతుందని పేర్కొంటూనే ప్రస్తుత ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసించారు. రాజుకు సామర్థ్యం  ఉన్నట్టయితే గుర్రాన్ని ఎలాగైనా పరుగెత్తించగలడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ సుప్రియ సులేను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం 28,000 కోట్లు కేటాయింపులు జరిగాయని అయితే, అధికారులకు-మంత్రులకు మధ్య సమన్వయలోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement